+91 8309 545 660
omsrivenkatamba@gmail.com

Bhagavathi Sri Venkatamba

శ్రీ వేంకటాంబ మందిరం
Registration No: 1/BKIV/2020
80G Approved
Darpan Approved
FCRA Approved

Menu

శ్రీ వేంకటాంబ మందిరం

Bhagavathi Sri Venkatamba Temple - A Divine Abode

నిత్యకైంకర్యములు

Daily rituals and services at the temple

Welcome to Sri Venkatamba Temple

అమ్మ సంకీర్తన నామము
శ్రీ వేంకటాంబ! శ్రీ వేంకటాంబ!
సంకటహరాంబ! శ్రీ వేంకటాంబ!
శ్రీ వేంకటాంబ! శ్రీ వేంకటాంబ!
సత్కృపాగరిమాంబ! శ్రీ వేంకటాంబ!

భక్తి మార్గాన్ని అందరికి ఉపదేశిస్తూ, ఆశ్రమ అభివృద్ధి చేస్తూ, ఇక్కడి కార్యక్రమాల ద్వారా భావితరాల వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించాలన్న ఒక చిన్న ప్రయత్నం.

Support Our Temple Activities

Your donations help us continue our spiritual and community services

Bank Details:

Account No: 6866890630

IFSC Code: IDIB000N127

Branch: Naidupet Branch

UPI QR Code:

UPI QR Code

UPI ID: omsrivenkatamba@upi

భక్తి సాగరంలో జ్ఞాన తరంగాలుంటాయని కొందరు, జ్ఞాన సాగరంలో భక్తి తరంగాలు ఉంటాయని కొందరు విజ్ఞులంటారు. నదీనాం సాగరోగతి: నదికి సాగరమే గతి , సముద్రంలో కలిసిపోయిన నదికి నామరూపాలుండవు, అలాగే భగవంతునిలో సర్వాత్మనా కలిసిపోయిన భక్తునికి నామరూపాలుండవు. అట్టి స్థితిని అందుకొన్న జ్ఞాని, భక్తురాలు అవధూత వేంకటాంబ. చదువు సంధ్యలు, అభిజాత్యము, గురూపదేశము పూర్వజన్మలోనే కాబోలు.

ఈ జన్మలో మాత్రం మట్టిలో మాణిక్యం వేంకటాంబ. మురికి గుంటలో బురదనీటి స్నానము, మాదిగ లంబ (గల్ల తొట్టి) నీరు పానము, నారాయణ స్మరణము, శాంభవీ ముద్రలో బ్రహ్మానుసంధానము, అప్పుడప్పుడు గృహస్థులిండ్లల్లో భిక్షకై ఒక చేతిలో మట్టి మూకుడు, మరొక చేతిలో దండము, మాసిపోని మేనిఛాయ, సూర్యుని కాంతి, చంద్రుని చలువ ఒక్కటైన కన్నులుగల తల్లి అవధూత వేంకటాంబ.

శ్రీ వేంకటాంబ మందిరం

వేంకటాంబను గొప్ప అవధూతగా గుర్తించిన వారు స్వామి నిఖిలనాధుల వారు. ఆయనచే వేంకటాంబ వారి దగ్గరకు పంపబడిన శిష్యులు వటుకనాధుడు. అమ్మ ఆయనకు పెట్టిన పేరు కృష్ణమాచార్యులు. గురువుల ఆదేశం మేరకు వటుకనాధుల వారు 1994 నుంచి వేంకటాంబ తల్లికి చేసిన కఠోర సేవ అసాధారణం మరియు వెలకట్టలేనిది.

అసాధారణ భగవన్నామస్మరణచే ముక్తికి చేరువైన వేంకటాంబ వారు, వారి భక్తులకు యోగ్యతను బట్టి కొందరికి మంత్రోపదేశము, కొందరికి హితము, కొందరికి సూర్య నమస్కారములు, వినాయక పూజ, శివాభిషేకం, అన్నదానం, నామస్మరణ, భజన బోధించినది. అమ్మ మహిమలు అనేకం (పూర్తి వివరాల కోసం క్లుప్తంగా ప్రచురించబడిన అమ్మ జీవిత చరిత్రను డౌన్లోడ్ చేసుకొనగలరు). తను శరీరాన్ని చాలించే తేదీ/ సమయాన్ని ముందుగానే శిష్యునికి చెప్పి నవంబరు 4, 2000 నాడు వేంకటాంబవారు భగవంతునిలో ఐక్యమయ్యారు.

శ్రీ వేంకటాంబవారి సమాధి, ఆశ్రమము కఱబల్లవోలులో నిర్మించబడినది. శిష్యులు వటుకనాధుల వారు భిక్షాటనకై కొన్ని వందల గ్రామాలు తిరిగి, దానితో సేకరించిన ధనంతో ఆశ్రమాన్ని నిర్మించడం జరిగినది. వటుకనాధుల వారిచే అమ్మ వారి పూజ విధానము, అనేక పుస్తకములు, నామ స్మరణ శ్లోకము, అష్టోత్తరం, సహస్రనామము, కర్పూర హారతి, సుప్రభాతసేవ, నిత్యపూజ, ఏకాంతసేవ.. అనేకం లిఖించబడినవి. నిత్యము ఆయనచే మరియు భక్తులచేత నిత్యపూజలు జరుగుతున్నవి.

శ్రీ వేంకటాంబవారి ఆశ్రమ అభివృద్ధి మరియు గుడి కార్యక్రమాలు, భక్తులు మరియు కఱబల్లవోలు గ్రామస్థులచే నిర్ధారించిన, నిర్మించబడిన కమిటీ చేత జరపబడుతున్నవి. అమ్మవారి ఆశ్రమ అభివృద్ధి సాధనకు విరాళాలు ఇస్తున్న భక్తులు అనేకం. అమ్మవారి ఆశ్రమములో పెళ్లిళ్లు, ఆరాధన, అన్నదాన, పుట్టు వెంట్రుకలు తీయడం వంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి.

Eye Camp Service

Eye Camp

Free eye checkup camps and distribution of glasses to the needy in rural areas.

Read More

Annadanam

Free food distribution to devotees and needy people as a service to humanity.

Read More

Go Seva

Care and protection of cows, considered sacred in Hindu tradition.

Read More

Medical Camps

Free health checkup camps in rural areas with distribution of medicines.

Read More
Summer Chalivendra Service

Summer Chalivendra

Providing buttermilk and water to people during hot summer months.

Read More

నిత్యకైంకర్యములు

శ్రీ భగవతి వేంకటాంబ వారి విశేష పూజలు ప్రతిరోజు శ్రీ వటుకనాధుల వారు మరియు భక్తులచే ఉదయాన్నే సుప్రభాత సేవతో మొదలయి ఏకాంత సేవ వరకు జరుపబడును.

Daily Puja Image
June 15, 2023

Daily Morning Puja

Suprabhata Seva and morning rituals performed daily at the temple.

Watch Video
Annadanam Event Image
May 28, 2023

Mass Annadanam

Free food distribution to over 500 devotees during temple festival.

View Details
Medical Camp Image
April 10, 2023

Medical Camp in Karaballavolu

Free health camp organized for villagers with specialist doctors.

View Details

కమిటీ సభ్యులు

శ్రీ వటుకనాధుల వారు

శ్రీ వటుకనాధుల వారు

ఫౌండర్

శ్రీ యెల్లా సురేష్ రెడ్డి

శ్రీ యెల్లా సురేష్ రెడ్డి

చైర్మన్

శ్రీ నెల్లూరు సుబ్బారావు

శ్రీ నెల్లూరు సుబ్బారావు

వైస్ చైర్మన్

శ్రీ ముమ్ముడి రామయ్య

శ్రీ ముమ్ముడి రామయ్య

సెక్రటరీ

శ్రీ కోటంరెడ్డి పరంధామ రెడ్డి

శ్రీ కోటంరెడ్డి పరంధామ రెడ్డి

జాయింట్ సెక్రటరీ

శ్రీ గెరికి బలరామయ్య

శ్రీ గెరికి బలరామయ్య

ట్రెసరర్

శ్రీ యెల్లా విజయభాస్కరరెడ్డి

శ్రీ యెల్లా విజయభాస్కరరెడ్డి

ఫౌండర్ మెంబరు ట్రస్టీ

శ్రీ గ్రిద్దలూరు రవీంద్ర రెడ్డి

శ్రీ గ్రిద్దలూరు రవీంద్ర రెడ్డి

మెంబరు ట్రస్టీ

శ్రీ మాకాని కృష్ణయ్య

శ్రీ మాకాని కృష్ణయ్య

మెంబరు ట్రస్టీ

శ్రీ పుచ్ఛకట్ల వెంకట రమణయ్య

శ్రీ పుచ్ఛకట్ల వెంకట రమణయ్య

మెంబరు ట్రస్టీ

శ్రీ ఉల్లిపాయల చెంచయ్య

శ్రీ ఉల్లిపాయల చెంచయ్య

మెంబరు ట్రస్టీ

శ్రీ షేక్ ఖాదర్ బాషా

శ్రీ షేక్ ఖాదర్ బాషా

మెంబరు ట్రస్టీ

శ్రీ తేరూరు రమణయ్య

శ్రీ తేరూరు రమణయ్య

మెంబరు ట్రస్టీ

శ్రీ సలపతి అంకయ్య

శ్రీ సలపతి అంకయ్య

మెంబరు ట్రస్టీ

శ్రీ రాగాల నాగమ్మ

శ్రీ రాగాల నాగమ్మ

మెంబరు ట్రస్టీ

Find Us Here

శ్రీశ్రీశ్రీ భగవతీ వేంకటాంబ వారి మందిరము నాయుడుపేటకు సమీపములో నిర్మించబడినది. పున్నేపల్లి మీదుగా కేవలము 12 కిలోమీటర్లు దూరంలో అమ్మవారి సన్నిధికి చేరుకొనవచ్చును.

Temple Entrance
Temple Architecture
Temple Interior

Our Address

శ్రీశ్రీశ్రీ భగవతీ వేంకటాంబ వారి మందిరము

కఱబల్లవోలు గ్రామము, ఓజిలి మండలము

నెల్లూరు జిల్లా - 524401, ఆంధ్రప్రదేశ్

Registration No: 1/BKIV/2020

View on Google Maps

Phone Contacts

గెరికి బలరామయ్య

+91 8309 545 660

WhatsApp Contacts

గెరికి హేమంత్ కుమార్

+1 425 326 7715

రామనారాయణ

+91 9908 714 878
Call Now

Connect With Us

Send Us a Message

We'd love to hear from you. Send us a message and we'll respond as soon as possible.

More Temple Views

Temple View 1
Temple View 2
Temple View 3
Temple View 4